సినిమా

F3 Movie: `ఎఫ్ 3` మూవీ టీమ్ కీల‌క నిర్ణ‌యం.. అదే నిజ‌మైతే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే!

Share

F3 Movie: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 3`. స‌క్సెస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించ‌గా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

2019లో రిలీజ్ అయిన సూప‌ర్ హిట్ మూవీ `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా `ఎఫ్ 3`ని రూపొందించారు. ఈ మ‌ధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మే 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎఫ్ 3 టీమ్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

అస‌లు విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. పైగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తొలి వారంలో ఆయా సినిమాల బడ్జెట్ కి తగ్గట్లుగా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును సైతం క‌ల్పిస్తున్నారు. ఇది కొన్ని చిత్రాల‌కు ప్ల‌స్ అవుతుంటే.. కొన్ని సినిమాల‌కు మైన‌స్‌గా మారుతుంది.

అందుకే ఎఫ్3 చిత్రానికి టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలతోనే రిలీజ్ చేయాలని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. వాస్త‌వానికి ఎఫ్3 లాంటి చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో కీల‌కం. టికెట్ రేట్స్ హైగా ఉంటే వారు థియేట‌ర్స్‌కు క‌ద‌ల‌డం క‌ష్టం అవుతుంది. అందుకే సాధారణ ధరలతోనే విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అవుతుంది.


Share

Related posts

Radhey Shyam: జాతకాలు నమ్మను.. కానీ కంగనా విషయంలో..అంటూ ప్రభాస్ వైరల్ కామెంట్స్..!!

sekhar

Nagarjuna: సినిమా టికెట్ల వ్యవహారంలో ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సెటైర్లు వేసేసిన నాగార్జున..??

sekhar

తిరుప‌తిలో పెళ్లి చేసుకుంటా: జాన్వీక‌పూర్‌

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar