“పుష్ప”లో మొదటి పార్ట్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విలన్ గా చేసిన ఫాహద్ ఫాజిల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. “పుష్ప” ఫస్ట్ టైం డైరెక్టర్ సుకుమార్ స్టోరీ చెప్పిన టైం లో పుష్ప ఒకే ఒక్క పార్ట్. కానీ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ నా పాత్ర సెకండాఫ్ లో ఉండేది. దీంతో ఇప్పుడు రెండు భాగాలుగా సినిమా తెరకెక్కింది. అయితే ఇటీవల డైరెక్టర్ సుకుమార్ నాతో మాట్లాడిన సమయంలో… పుష్ప మూడవ భాగం కూడా ఉన్నట్లు అందుకు తగ్గ అవకాశాలు స్క్రిప్ట్ పరంగా తన దగ్గర చాలా ఆలోచనలు సుకుమార్ చెప్పినట్లు ఫాహాధ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫాహద్ ఫాజిల్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.
పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందే “పుష్ప 3” కి సుకుమార్ సంచలన ప్లాన్..??
ఇదిలా ఉంటే పుష్ప రెండో భాగం సినిమాకి సంబంధించి షూటింగ్ ఆగస్టు రెండో వారంలో స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది. మొదటి భాగంలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన మేనరిజం.. లాంటివి రెండో భాగంలో డైరెక్టర్ సుకుమార్ చాలానే ప్లాన్ చేయడం జరిగిందంట. పుష్ప మొదటి భాగం భారీ విజయం సాధించింది. కనీసం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ప్రమోషన్ కార్యక్రమం సరిగ్గా చేయకపోయినా గాని అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ బన్నీ క్రేజ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా బన్నీకి తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది.
ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బన్నీ అనేక రికార్డులు సృష్టించటం ఇండస్ట్రీలోనే సంచలనం రేపింది. భాషకి ప్రాంతాలకతీతంగా “పుష్ప” చాలామందిని ఆకట్టుకుంది. సామాన్యులు సినీ సెలబ్రిటీలు ఇంటర్నేషనల్ ఆటలకు చెందిన ప్లేయర్లు “పుష్ప” మేనరిజం బాగా ఫాలో అయ్యారు. దీంతో ఇప్పుడు పుష్ప రెండో భాగం.. వీలైన అన్ని ఎక్కువ భాషలలో డబ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగింది. ఆగస్టు రెండో వారం నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా.. జరిపి వీలైనంత త్వరగా పుష్ప 2 కంప్లీట్ చేయనున్నారంట. ఈసారి ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలకు సినిమా యూనిట్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!