Surekha Konidela: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినయోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలు తమ అభిమానులకు చేరువ అవ్వడం కోసం సోషల్ మీడియాను వేరె లెవల్లో ఉపయోగిస్తున్నారు. దీనినే సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారు. స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద డబ్బులు దోచేయడం వంటివి చేస్తూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు స్టార్ హీరోల భార్యలను టార్గెట్ చేసి.. వారి పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను సృష్టిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి సతీమణి, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెలకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
నిన్న సురేఖ కొణిదెల పేరుతో ట్విటర్ ఖాతా దర్శనమిచ్చింది. అంతేకాదు తొలిపోస్ట్ తనయుడు రామ్ చరణ్ గురించి పెట్టడంతో.. మెగా అభిమానులు, నెటిజన్లు ఆ అకౌంట్‌ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసేశారు. దీంతో కొద్ది గంట్లోనే ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది.
కానీ, నిజం ఏంటంటే సురేఖ పేరిట ఉన్న ఈ ట్విట్టర్ ఖాతా ఫేక్ అట. ఈ ఖాతాను మెగా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏ ఒక్కరూ ఫాలో కావడం లేదు. పైగా సురేఖ కొణిదెల ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టెక్ కూడా ఉండటంతో.. ఇది ఫేక్ అకౌంట్ అని తేలిపోయింది. దీంతో ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Subscribe My Official YouTube Channel : https://t.co/lQmlfU6HsL
— Surekha Konidala (@SurekhaKonidala) February 28, 2022