Family Man 2: ఇండియాలో బెస్ట్ వెబ్ సిరీస్ లో ఒకటిగా మొదటి సీజన్ మంచి హిట్ సాధించిన ఫ్యామిలీ మాన్ సీజన్ టూ విడుదలకి సిద్ధమవుతోంది. రెండు రోజుల ట్రైలర్ విడుదల చేశారు. జూన్ నాలుగో తేదీన ఈ సిరీస్ ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ట్రైలర్ కాంట్రవర్సీ కుదిపేసింది. అమెజాన్ ప్రైమ్ లో మొన్న విడుదలైన ట్రైలర్ పై తమిళనాడులో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమిళ సంఘాలు కొన్ని ఈ ట్రైలర్ ని తీవ్రంగా తప్పు పట్టాయి. ఆందోళనలు, ధర్నాలు, హెచ్చరికలు సాగాయి. “తమిళులను తీవ్రవాదులుగా చూపించారు. డైలాగ్ కూడా అలాగే ఉంది” అనేది వారి ఆరోపణ..
Family Man 2: వెనక్కు తగ్గిన ప్రైమ్..!
ఈ వివాదంతో అమెజాన్ ప్రైమ్ కాస్త వెనక్కు తగ్గింది ట్రైలర్ లో ఆ సీన్ ని తొలగించింది. “తమిళ మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. కథలో భాగంగా ఇలా చిన్న సీన్ పెట్టాల్సి వచ్చింది. దీన్ని తొలగిస్తున్నాం. తమిళులను ఎక్కడా అవణించలేదు” అంటూ ఈ సిరీస్ టీమ్ నుండి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో అమెజాన్ ప్రైమ్ మాత్రం వివాదాలు లేకుండా ఆ ట్రైలర్ లో మార్పులు చేసి, మళ్ళీ విడుదల చేసింది. దీంతో తమిళులు శాంతించారు. ఈ సిరీస్ లో సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రధారిగా తొలి సీజన్ లో మంచి నటనతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఆయనకు తోడు సమంత కూడా జత కలవడం .. ట్రైలర్ లోనే చాలా ఆసక్తికర ఘట్టాలు ఉండడంతో దీనిపై మరింత ఉత్సుకతని పెంచింది..!!
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!