Family Man 2 Series: కెరీర్ లోనే మలుపు – సమంత ఇంత రిస్క్ ఎందుకు చేసినట్టు..!?

Share

Family Man 2 Series: సౌత్ నటీమణుల్లో సమంత రూటు ప్రత్యేకం.. మొదట గ్లామర్ పత్రాలు చేసిన ఆమె తర్వాత నటనకు ఆస్కారం ఉండే ప్రాధాన్య పత్రాలు ఎంచుకుంటూ వచ్చారు.. అలా అలా తన కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ కథల్లో నటించారు. అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు. తెలుగు, తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ సౌత్ హీరోయిన్ల నంబర్ గేమ్ లో టాప్ లోనే ఉండేవారు.. అటువంటి సమంత తన పుష్కర కాలం కెరీర్ లో ఏ నాడూ లేని రిస్క్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ కోసం ఆమె తన కెరీర్ ని పణంగా పెట్టినట్టే.. తమిళుల ఆగ్రహావేశాలు మధ్య విడుదలైన ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఏ మాత్రం తమిళులు చేస్తున్న ఆరోపణలకు వాస్తవ రూపంలో ఉన్నా ఆమె పని అక్కడ ముగిసినట్టే.. ఏ మాత్రం ఊరుకోరు. ఇప్పటికే ఆమెను తమిళ సినిమాల నుండి బహిష్కరించాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి..

 

Family Man 2 Series: విడుదల అయినట్టే.. రెండు రోజుల్లో ఫలితం..!

ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ఈరోజు విడుదలయింది. మొత్తం 9 ఎపిసోడ్లు. తమిళనాడులోని Liberation Tigers of Tamil Eelam (LTTE) చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అదో పెద్ద వివాదాస్పద అంశం. సమంత పాత్రపై స్పష్టత లేకుండానే.. తమిళుల ఆగ్రహం ఆకాశాన్ని తాకింది. నిజానికి సమంత తమిళియన్. ఆమె కేరళలో పుట్టినప్పటికీ.. తమిళనాడులో పెరిగారు. అందుకే తమిళ సంప్రదాయాలు, మనోభావాలు ఆమెకి బాగా తెలుసు. సహజంగా ఆమె వివాదాలకు దూరం. సాదాసీదాగా నటిస్తూ.., తన పని తాను చేసుకునే రకం. వేరే హీరోయిన్లకు ఉన్నట్టు అఫైర్ గొడవలు, గాసిప్పులు, స్టోరీలు ఏమి లేవు. మాటలు కూడా లిమిట్ లోనే మాట్లాడుతుంది. తమిళుల గురించి.. LTTE గురించీ అన్నీ తెలిసి ఆమె నటించారు అంటేనే దీనిలో ఒక గొప్ప నటనా అనుభూతి కోసమో.. లేదా తన కెరీర్ లో ఇదో మైలురాయి కోసమో.. లేదా వివిధ రహిత పాత్ర అయి ఉండాలి. ఈరోజు ఈ సిరీస్ విడుదల కానుంది. అంతా బాగుంటే ఆమెకు ఏ గొడవ లేనట్టే. అలా కాకుండా తమిళుల ఆరోపణలు నిజమైతే.. ఆమె వివాదంలో ఇరుక్కున్నట్టే.. అప్పుడు ఇక ఆమెని తమిళ పరిశ్రమ నుండి బహిష్కరించాలని డిమాండ్లు పెద్దగానే ఉంటాయి.. సో.., ఈ ఒక్క సిరీస్ తో ఆమె కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నట్టే.. రెండు రోజుల్లో పర్యవసానాలు, ఫలితాలపై స్పష్టత రావచ్చు..


Share

Related posts

YS Sharmila: డౌటే లేదు.. జగన్ పైకి కూడా షర్మిల బాణం..!?

Srinivas Manem

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. వెండి ధర జిగేల్..!!

bharani jella

Chiranjeevi .. ‘ఇంతింతై వటుడింతయై..’ మెగాస్టార్ నట ప్రస్థానానికి 43 ఏళ్లు

Muraliak