Radheshyam: ప్రభాస్ అభిమానులతో పాటు అందరూ ఊహించిన దానికంటే ‘రాధే శ్యామ్’ మూవీ రన్‌టైమ్ తక్కువగానే ఉండబోతోందట. యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 11వ తేదీన నేరుగా థియేటర్లలోనే ప్రపంచవ్యాప్తంగా 7 భాషలలో విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన ప్రకటించిన సమయానికి ‘రాధే శ్యామ్’ మూవీని భారీగా అన్నీ భాషలలో విడుదల చేయడానికి పనులు జోరుగా సాగుతున్నాయి.
ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు చాలా తక్కువ రన్ టైమ్‌ను లాక్ చేసారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇలాంటి భారీ బడ్జెట్ లవ్ డ్రామా అది కూడా పాన్ ఇండియన్ సినిమాకు ఇంత తక్కువ రన్‌టైమ్‌ను లాక్ చేయడం అంటే షాకింగానే ఉందంటున్నారు అభిమానులు. ఇప్పుడిదే అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. కాగా, హిందీ వెర్షన్‌ను చూసిన సెన్సార్ యూనిట్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
Radheshyam: తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్లో చాలా భిన్నమైన సౌండ్‌ట్రాక్..!
తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్లో చాలా భిన్నమైన సౌండ్‌ట్రాక్ ఉంటుంది. మేకర్స్ త్వరలోనే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో పరమహంస అనే కీలకపాత్రలో కనిపించబోతున్నారు. పాటలకు సౌత్ భాషలలో జస్టిన్ ప్రభాకరన్, హిందీలో వేరే సంగీత దర్శకులు సమకూచారు. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ అందించనున్నారు.