సాధారణంగా ఏ భాష డైరక్టర్ అయినా మొదట తమ సినిమా పరిశ్రమలోని హిట్ కొట్టి వేరే భాషా హీరోలను డైరక్ట్ చేద్దామనుకుంటాడు. ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి అలా వస్తూంటారు. అక్కడ ఓ విజయం సాధించగానే తెలుగు హీరోకు కథ చెప్పి ఒప్పించాలనుకుంటారు. ఎందుకంటే, తెలుగు మార్కెట్ పెద్దది కావటం.. రెమ్యునరేషన్స్ , సినిమా బడ్జెట్ లు ఎక్కువగా ఉంటాయి కనుక. అయితే ఇప్పుడు కన్నడ దర్శకులు కూడా మనవైపు చూస్తున్నారు. KGF సూపర్ హిట్ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక్కడ ప్రభాస్, NTRలతో ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. తర్వాత రామ్ చరణ్ అని అంటున్నారు.
ఈ క్రమంలోనే కన్నడ హీరోతో సూపర్ హిట్ కొట్టి ఇక్కడ కంటిన్యూ కాకుండా తమ దర్శకులు తెలుగు హీరోలు చుట్టూ కథలు పట్టుకుని తిరుగుతున్నారని కన్నడిగులు తిట్టిపోస్తున్నారు. తమ కన్నడ హీరోలతో నెక్ట్స్ సినిమాలు చేస్తే తమ కన్నడ పరిశ్రమ బాగుంటుంది కదా అంటున్నారు. అలాగే తెలుగు హీరోలు కూడా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారని వాపోతున్నారు. అదే రాజమౌళి అంత పెద్ద హిట్స్ వచ్చినా తెలుగు హీరోలను వదలటం లేదని, హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా వెళ్లటం లేదని తమ దర్శకులు అలా ఆలోచించటం లేదని విమర్శిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ ‘మఫ్టీ’ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీసిన సంగతి తెలిసినదే. ఆ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది. కాగా ఈ చిత్ర దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఇది పూర్తైన తరువాత రామ్ చరణ్ 16వ సినిమా కన్నడ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలోనే కన్నడిగులు హర్ట్ అవుతున్నారు అని తెలుస్తోంది.