NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: “OG” సెట్స్ లో పవన్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా లేటెస్ట్ లుక్ కి దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!!

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రంగంలో జయప్రజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ రావట్టడంలో పవన్ శైలి వేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి వచ్చే ఓపెనింగ్స్ మరే హీరోకి రావు. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే… బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందే. దాదాపు పది సంవత్సరాలు పాటు ఒక హిట్టు లేకపోయినా గాని టాప్ మోస్ట్ హీరోగా చలామణి అయి… యూత్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో పవన్. కొన్ని దశాబ్దాలు పాటు యువతని ప్రభావితం చేస్తున్న హీరో. అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ ఉర్రూతలూగిస్తున్న పవన్… ప్రస్తుతం వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు. చేస్తున్న వాటిలో సుజిత్ దర్శకత్వంలో “OG” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Fans of Pawan's looks in OG sets are raving about the latest look

ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ ముంబైలో జరుపుకుంటుంది. ఈ క్రమంలో “OG” సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి మేకర్స్ రిలీజ్ చేశారు. స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కార్వాన్ వెనుక వైపు ఫోన్ లో మాట్లాడుతున్న స్టిల్ ఇప్పుడు నెట్ ఇంట ట్రెండింగ్ లో ఉంది. మోస్ట్ స్టైలిష్ లుక్ లో పవన్ కనిపిస్తున్నాడు. రఫ్ గా క్యారెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.

Fans of Pawan's looks in OG sets are raving about the latest look

ఒకపక్క “OG” సినిమా చేస్తూనే మరోపక్క సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ కంప్లీట్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా కూడా చేస్తూ ఉన్నారు. ఈ మూడు సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “హరిహర వీరమల్లు” కంప్లీట్ అయ్యింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది… ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి.. ఏపీకి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ ఆలోచన అన్నట్లు సమాచారం.


Share

Related posts

RRR: జపాన్ లో “బాహుబలి” కంటే మంచి స్పీడ్ మీద ఉన్న “RRR”..!!

sekhar

Sruthi Raj Latest Photos

Gallery Desk

త్రివిక్రమ్ అనుకున్నది వర్కౌట్ అవకపోతే ఎన్టీఆర్ సినిమా వదిలేస్తాడా ..?

GRK