KGF 2: కన్నడ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన `కేజీఎఫ్ చాప్టర్ 1` 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారమే కాదు.. కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతి కూడా తారా స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు చాప్టర్ 1కు కొనసాగింపుగా `కేజీఎఫ్ చాప్టర్ 2` రాబోతోంది.
హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిది శెట్టి హీరోయిన్గా నటించింది. అలాగే సంజయ్ దత్ విలన్‌గా చేశారు. గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.
అయితే విడుదలకు దగ్గర పడడంతో ఎప్పటిలాగానే యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు కేజీఎఫ్2 చూశానంటూ సోషల్ మీడియా లో ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ‘కన్నడ సినీ పరిశ్రమకు కేజీఎఫ్ 2 కిరీటం లాంటింది. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎండ్ వరకు.. ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, బీజీఎం ఓ రేంజ్లో ఉన్నాయి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు. యశ్, సంజయ్ దత్‌లు తమదైన నటనతో మిస్మరైజ్ చేశారు. ఇక క్లైమాక్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. అందరూ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. కేజీఎఫ్ 2 కేవలం శాండల్‌వుడ్ బాక్ల్‌బస్టర్ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ` అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈయన మాటలు.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను కేజీఎఫ్ 2 ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!