Bhola Shankar: మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “భోళాశంకర్”అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ అప్ డేట్ మేకర్స్ విడుదల చేయడం జరిగింది. “భోళామానియ” అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పాటలో మెగాస్టార్ లుక్ మరియు మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో పూర్తి లిరికల్ సాంగ్ జూన్ 4వ తారీఖు విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. “భోళాశంకర్” ఆగస్టు 11వ తారీకు విడుదల కాబోతోంది. తమిళంలో “వేదాళం” సినిమాకి రీమేక్ గా తెలుగులో “భోళాశంకర్” గా రాబోతోంది.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తెలుగులో చిరంజీవి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొన్ననే స్విజర్లాండ్ లో పాటలు చిత్రీకరణ చేయడం జరిగింది. చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య తో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది.
“భోళాశంకర్” సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ కి సంబంధించి మెగాస్టార్ స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. మెహర్ రమేష్ హిట్ అందుకుని చాలా కాలం అయ్యింది. సో “భోళాశంకర్” ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఏదో విధంగా సినిమా విజయం సాధిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. మరోపక్క తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేయడం జరిగిందంట. సో వేదాళం సినిమా రీమేక్ అయినా గాని కొద్దిగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.