NewsOrbit
Entertainment News సినిమా

పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..!!

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది అభిమానులతో పాటు ప్రముఖులు కూడా పవన్ అంటే ఇష్టపడతారు. హీరోగా కంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి చాలామంది చిన్నల్లు మొదలుకొని పెద్దవాళ్లు వరకు ఎంతగానో అభిమానిస్తుంటారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతిస్పందిస్తూ ఎదుటి వారి బాధని తన బాధగా.. ఎంచుకొని చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్న పవన్.. ప్రజా సమస్యల విషయంలో ఏమాత్రం బెదిరిపోకుండా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాణిస్తున్నారు.

Former cricketer Irfan Pathan made interesting comments on Pawan Kalyan

ఇదిలా ఉంటే తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్… పవన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ హీరోగా నటించిన “కోబ్రా” సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో … పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని అన్నారు. “పుష్ప” సినిమాలో నటించిన అల్లు అర్జున్ నటనకు ఇంప్రెస్ అయ్యానని పేర్కొన్నారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కంటెంట్ కలిగిన సినిమాలను చూసి బాగా ఎంజాయ్ చేస్తానని..ఇర్ఫాన్ పఠాన్ తెలియజేయడం జరిగింది.

Former cricketer Irfan Pathan made interesting comments on Pawan Kalyan

కాగా రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఈరోజు రాత్రి “జల్సా” సినిమా స్పెషల్ షోలు గట్టిగా పడుతున్నాయి. ఆల్రెడీ నిన్నటి రాత్రి నుండి పవన్ నటించిన “జల్సా” మరియు “తమ్ముడు” స్పెషల్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్లలో వేయటం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా రేపు పవన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కొత్త సినిమా “హరిహర వీరమల్లు” ఇంకా పలు ప్రాజెక్టులకు సంబంధించి అప్ డేట్ రానున్నట్లు సమాచారం.


Share

Related posts

‘అదిరింది’ షో వల్ల జడ్జి నాగబాబు ని బండబూతులు తిడుతున్నారు..! వీళ్ళ బాధ ఏమిటో అర్థం కాదు….

arun kanna

Devatha: ఆదిత్య, రుక్మిణి రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..! మాధవ్ ను తండ్రి కాదన్న చిన్మయి..!

bharani jella

నిర్మాత మ‌రో సాహ‌సం

Siva Prasad