సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు.. తెలుగుదేశం ఎం.పి గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ సినిమా జూలైలో ప్రారంభం కానుంది. అదేంటి ఇది వరకే దిల్‌రాజు నిర్మాణంలో `అదే నువ్వు అదే నేను` పేరుతో స్టార్ట్ అయ్యిందిగా! అనే సందేహం రావచ్చు. నిజమే! దిల్‌రాజు బ్యానర్లో గల్లా అశోక్ సినిమా చేయాల్సింది కానీ.. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు గల్లా అశోక్ సినిమా కోసం డైరెక్టర్‌ను తెగ వెతికారట. చివరకు శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం సైలెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడంనుంది.