వంటలక్కను డాక్టర్ బాబును కలుపుతా అంటున్న గంగవ్వ.. సాధ్యమేనా?

వంట‌ల‌క్క‌, డాక్టర్ బాబు.. ఈ పేర్లు విన‌ప‌డ‌గానే ట‌క్కున గుర్కొచ్చేది “కార్తీక దీపం” సీరియ‌ల్‌. మ‌రీ ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన నిరుపం ప‌రిటాల‌‌.. డాక్ట‌ర్ బాబుగా ఒదిగిపోయిన ప్రేమి విశ్వ‌నాథ్‌ల న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌థా బ‌లానితోడు డాక్ట‌ర్‌బాబు, వంట‌ల‌క్క‌ల న‌ట శిశ్వ‌రూపంతో కార్తీక దీపం సీరియ‌ల్ కు ఎన‌లేని ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఇటీల‌వ ప్రారంభ‌మైన ఐపీఎల్‌, బిగ్ బాస్ షోలను సైతం వెనక్కినెట్టి మ‌రీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది కార్తీక‌దీపం సీరియ‌ల్‌.

“మైవిలేజ్ షో” అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై.. బిగ్ బాస్ స్టార్‌గా ఎదిగారు గంగ‌వ్వ‌. తెలుగు ప్రేక్ష‌కుల‌లో ఎన‌లేని క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ఇంత‌కాలం గ‌డుస్తున్న డాక్ట‌ర్ బాబు, వంట‌లక్క‌లు క‌ల‌వ‌డం లేదంటూ విసిగిపోయిందో ఏమో మ‌రి.. ఇప్పుడు వీరిద్ద‌రిని క‌లిపే ప‌నిలో ప‌డ్డారు గంగ‌వ్వ‌. అవును మీరు చ‌దివిందే నిజ‌మే ! ఇప్పుడు వంట‌ల‌క్క డాక్ట‌ర్ బాబు.. మ‌ధ్య‌లో గంగ‌వ్వ ! వ‌చ్చిచేరారు.

కార్తీక దీపం సీరియ‌ల్‌లో ఎలాగూ వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబులు క‌ల‌వ‌డం లేద‌నీ, వీరిద్ద‌రినీ క‌లిపే బాధ్య‌త‌ను గంగ‌వ్వ‌కు ఇస్తూ… స్టార్ మా ప్రత్యేక షో చేస్తోంది. ద‌స‌రా క‌నుక‌గా రాబోతున్న ఈ షోనే జాత‌రో జాత‌ర ! ఈ షోలో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబుల‌ను క‌లిపి గంగ‌వ్వ మ‌స్తు ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చారు. అలాగే, డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌లు సైతం ఇక్క‌డ కూడా అద‌ర‌గొట్టేశారు. మ‌రీ వీరిద్ద‌రిని గంగ‌వ్వ ఎలా క‌లిపింది.. అస‌లు ఏం జ‌రిగిందో తెలుసు కోవ‌డానికి ఆ షోను మీరు కూడా చేసేయండి మ‌రి!