సినిమా

Gangubai Kathiawadi: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `గంగూబాయ్‌`.. ఎప్పుడు, ఎక్క‌డ‌..?

Share

Gangubai Kathiawadi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ తాజా చిత్రం `గంగూబాయ్ క‌తియావాడి`. సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్‌, విజయ్‌ రాజ్‌, శంతను మహేశ్వరి, ఇందిరా తివారి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ కతియావాడి జీవితకథ ఆధారంగా తెర‌కెక్కిన ఈ లేడి ఓరియెంటెడ్ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది.

రిలీజ్ అయిన అన్ని భాష‌ల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్ త‌న‌దైన న‌ట‌న‌, డైలాగ్ డెలివరీతో మిస్మ‌రైజ్ చేసింది. ఆ పాత్రలో ఆమె లీనమయ్యే విధానానికి ఫిదా అవ్వ‌కుండా ఉండ‌లేరు. ప్రేక్ష‌కులే కాదు విమ‌ర్శ‌కులు సైతం అలియా న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను భారీ ధ‌రకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. ఏప్రిల్ 26న స్ట్రీమింగ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ మేర‌కు నెట్‌ఫిక్స్ వారు సోష‌ల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. దీంతో థియేటర్‌లో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు.. ఓటీటీ రిలీజ్ కోసం అతృత‌గా ఎదురు చూస్తున్నారు.

కాగా, భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యాన‌ర్ల‌పై జ‌యంతిలాల్‌ గ‌డ, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంచిత్‌ బల్హారా, అంకింత్‌ బల్హారా, సంజయ్ స్వ‌రాలు అందించారు.


Share

Related posts

AP High court: టాలీవుడ్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఏపి హైకోర్టు..! టికెట్ల ధరలపై కీలక తీర్పు..! జగన్ ఏమంటారో..?

somaraju sharma

Balakrishna: బాలకృష్ణ మూవీ కోసం సరికొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని లైన్ లో పెడుతున్న అనిల్ రావిపూడి..??

sekhar

పూజా హెగ్డే బాలీవుడ్ లో కియారా కి చెక్ పెట్టబోతుందా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar