సినిమా

Gangubai Kathiawadi: హాలీవుడ్ మూవీలకు దీటుగా నిలుస్తోన్న గంగూబాయి కతియావాడి.. ఆ టాప్-10 లిస్ట్‌లో చోటు!

Share

Gangubai Kathiawadi: బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ టైటిల్ రోల్లో నటించిన గంగూబాయి కతియావాడి సూపర్ హిట్ అయ్యింది. ఒక వేశ్య కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అయినప్పటికీ… ఇండియాలో రూ.130 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. గంగూబాయిగా అలియాభట్ చూపించిన నటన వేరే లెవెల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో అలియా భట్ మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. అలానే ఈ అమ్మడి ఇమేజ్ రెట్టింపు అయింది.

 Ganguly Katiyawadi , who is standing as a beacon for Hollywood movies
Ganguly Katiyawadi , who is standing as a beacon for Hollywood movies

Gangubai Kathiawadi: ఆ టాప్-10 లిస్ట్‌లో చోటు!

ఈ మూవీ థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత అంటే ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఇది థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. డిజిటల్ ప్రియులు ఈ సినిమాను చూసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్‌స్ర్కైబర్లు భారీగా పెరగడం విశేషం. విశేషమేంటంటే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలోనే కాదు నెట్‌ఫ్లిక్స్‌ అమెరికాలోనూ టాప్ టెన్ లిస్టులో నిలిచింది. సాధారణంగా ఏ దేశంలో ఏ సినిమాని తమ యూజర్లు ఎక్కువగా చూస్తారో వాటిని టాప్-10లో చేర్చుతుంది నెట్‌ఫ్లిక్స్‌ టీమ్. అయితే యూఎస్ ట్రెండ్స్ లిస్ట్ లో గంగూబాయి కతియావాడి మూవీ టాప్-10లోనే నిలిచి ఆశ్చర్యపరిచింది. అమెరికాలో మన ఇండియన్ సినిమా అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా టాప్-10లో ప్లేస్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. నెట్‌ఫ్లిక్స్‌ యూఎస్ లో టాప్-10లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కానీ గంగూబాయి హాలీవుడ్ సినిమాలకు దీటుగా నిలుస్తోంది.

 Ganguly Katiyawadi , who is standing as a beacon for Hollywood movies
Ganguly Katiyawadi , who is standing as a beacon for Hollywood movies

Gangubai Kathiawadi: అలియా సినిమాకి గ్లోబల్ ఫేమస్

విదేశీయులు బాగా వీక్షిస్తున్న గంగూబాయి కతియావాడి గ్లోబల్ మూవీగా ఫేమస్ అవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ముంబైలోని కమాఠీపురలోని గంగూబాయి అనే ఓ మహిళా మాఫియా డాన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక ఎమోషనల్ డ్రామా గా సాగుతుంది. బాగా ఆకట్టుకునే కథ తో ఈ సినిమా వచ్చింది కాబట్టే అమెరికన్ ఆడియన్స్ కూడా దీనిని వీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంజయ్ లీలాభన్సాలీ దర్శకుడి గా వ్యవహరించారు.


Share

Related posts

ఒక్క సాలిడ్ హిట్ తో రేటు పెంచాడు…

Siva Prasad

నిహారికకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

Teja

Aacharya: “ఆచార్య” రిజల్ట్ ఎఫెక్ట్ కుర్ర డైరెక్టర్ నీ పక్కన పెట్టేసిన చిరు..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar