Getup Srinu: ఈరోజుల్లో బిగ్‌బాస్ షో గురించి తెలియని వారూ ఎవరూ ఉండరు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ బిగ్‌బాస్ షోను చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. షో లో వస్తే చాలా పాపులర్ అవుతామనే నమ్మకంతో బిగ్‌బాస్ ఆఫర్ కోసం ఎదురు చూసేవారు చాలామందే ఉన్నారు. అలానే ఆఫర్ వచ్చిన కూడా వెళ్లని వాళ్లూ ఉన్నారు. కొందరు సెలబ్రెటీలను పిలిచి అధిక రెమ్యునరేషన్ ఇస్తామని ఆశపెట్టినా కూడా కొంతమంది ఆ ఆఫర్స్‌కి నో!! అనే చెప్తుంటారు. వారిలో గెటప్ శ్రీను ఒకడు. రీసెంట్గా బిగ్ బాస్ నుంచి గెటప్ శ్రీనుకి ఆఫర్ వచ్చింది. కానీ శ్రీను దానిని తిరస్కరించాడు.
Getup Srinu: ఎందుకు వెళ్లలేదంటే
దాంతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన మీరు ఎందుకు వెళ్లలేదు? అంతే కాకుండా జబర్దస్త్ నుండి వెళ్లిన చంటి, ఫైమా లకు కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అని అడిగిన ప్రశ్నకు శ్రీను సమాధానం చెప్పారు. “వాళ్ళు ఇప్పుడేగా వెళ్ళింది. అక్కడ వాళ్లు కాస్త సెట్టిల్ అయ్యాక సపోర్ట్ చేద్దామనుకున్నా కానీ చంటి అన్న బయటికి వచ్చేసాడు’. ఇక ఆఫర్ వచ్చిన వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే ‘ప్రస్తుతం నేను జబర్దస్త్ లో, సినిమా షూటింగ్స్ లో బిజీ గానే ఉంటున్నాను. వాటిని వదులుకొని మరీ బిగ్ బాస్ షో కోసం నా టైమ్ మొత్తం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళలేదు. “అని చెప్పాడు.
ఆ ఫీలింగ్ పోతది
ఒకవేళ ఎక్కడ షూటింగ్స్ ఏం లేకుండా కాలిగా ఉంటే బిగ్ బాస్ కీ వెళ్లి ఉండేవాడినెమో .అయినా బిగ్ బాస్‌లో అన్ని ఎమోషన్స్, పర్సనల్ విషయాలు బయటకి వస్తాయి. మనం పర్సనల్ గా ఎలా ఉంటామో అందరికీ తెలిసిపోతే స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపించలేం. మన విషయాలు బయటకు తెలియకుండా ఉంటేనే షూటింగ్స్‌లో యాక్టీవ్ గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. అందుకే నేను బిగ్ బాస్‌కి వెళ్లలేదు అని గెటప్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు.