Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గని. సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్దతో కలిసి అల్లు అరవింద్ పెద్దకొడుకు బాబీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వరుణ్ తేజ్ నుంచి గద్దలకొండ సినిమా వచ్చి చాలా ఏళ్ళవుతోంది. దాంతో మెగా అభిమానుల్లోనే కాకుండా అందరిలోనూ భారీగా అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడటంతో మేకర్స్ తాజాగా వైజాగ్‌లో భారీగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. అల్లు అరవింద్ సహ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో గని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దాదాపు మూడేళ్ళ కష్ఠం అని చిత్రబృందం తెలిపింది. ఈ మూడేళ్ళలో వరుణ్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని..మూడేళ్ళ పాటు బాక్సర్‌గా బాడీని మేయింటైన్ చేయడం అంత ఈజీ కాదని చెప్పారు.
Ghani: వరుణ్ కెరీర్లోనూ గని సినిమా అంతే ముఖ్యం
ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా అద్భుతంగా వచ్చిందని నేను చూశానని సూపర్ హిట్ పక్కా అన్నారు. ఇక దర్శకుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఆయన కెరీర్లో ఎంత ముఖ్యమో వరుణ్ కెరీర్లోనూ గని సినిమా అంతే ముఖ్యం అని పవన్‌కు తమ్ముడు మైల్ స్టోన్ మూవీగా నిలిచినట్టుగానే, వరుణ్‌కు గని సినిమా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, నదియా, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.