Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “గని” సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా యూనిట్ తో వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావటంతో వైజాగ్ మారుమ్రోగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతగా అల్లు బాబి సినిమాని నిర్మించడంతో.. ఖచ్చితంగా తన తండ్రి తర్వాత ఆ స్థాయిలో అన్నయ్య రాణిస్తాడు అంటూ బాబి పై అల్లు అర్జున్ కామెంట్లు చేయడం జరిగింది. ఇదే తరుణంలో మరో నిర్మాత సిద్దు ముద్ద పై కూడా అల్లు అర్జున్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక హీరో వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ… నాకు చిన్ననాటి నుండి వరుణ్ అంటే చాలా ఇష్టం.
పుట్టిన నాటి నుండి వరుణ్ మంచి అందగాడు. ఎంతో క్యూట్ గా ఉండేవాడు. అయితే వరుణ్ తేజ్ సినిమాల్లోకి వచ్చాక మరింత గౌరవం ఏర్పడింది. ఎందుకంటే తాను సెలెక్ట్ చేసుకునే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్టోరీలు ఎంచుకునే విషయంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు. ఏదో ఒక సినిమా చేద్దాం అన్న విధంగా కాకుండా ట్రెండ్ అనుసరించి కాకుండా తనకంటూ సపరేట్ గుర్తింపు ఉండేలా స్టోరీలు సెలెక్ట్ చేస్తాడు. ఒకపక్క విజయాలు సాధిస్తూనే మరో పక్క కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలన్న రిస్కు తీసుకోవటం అభినందనీయం. గ్యారెంటీగా వరుణ్ తేజ్ కెరీర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తయితే గని మరో ఎత్తు. సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు.
ఖచ్చితంగా వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి గని మంచి విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను ఎంతో బాగుంది అంటూ బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా చాలా బాగా నటించింది అని పొగిడాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. వరుసపెట్టి మ్యూజిక్ హిట్ లు ఇస్తూ ఉన్నాడు. గ్యారెంటీగా సినిమా విజయం సాధిస్తుంది ఇంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు చివరిగా నా ఆర్మీ.. గురించి కూడా మాట్లాడాలి. చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది. మీరు ఎంతో మంచి పనులు బయట చేస్తున్నారు వాటిని.. స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా మంచి పని స్టార్ట్ చేయాలి అని ఆలోచన చేస్తున్న అంటూ… అల్లు అర్జున్ గని ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం జరిగింది.