Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని`. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలను పోషించారు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 8న విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ విసృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ గని చిత్రం చిత్రం.. రూ 26.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రేపు బరిలోకి దిగబోతోంది. దీంతో రూ. 26.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది.
మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. కాగా, `గని` మూవీకి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లకు లాక్ చేశారు. ఎస్.ఎస్. తమన్ ఈ మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.