Ghani: కిరణ్ కొర్రపాటి అనే యంగ్ డైరెక్టర్‌తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన తాజా చిత్రమే `గని`. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రలను పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ కలిసి ఈ మూవీని నిర్మించారు.
అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదలైన నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. టాక్ అంతంత మాత్రంగా ఉండటంతో.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.22 కోట్ల షేర్ ఈ చిత్రం.. రెండో రోజు మరీ దారుణంగా రూ. 72 లక్షల రేంజ్ లో మాత్రమే షేర్ వసూల్ చేయగలిగింది. ఈ కలెక్షన్స్ చూసి.. పాపం వరుణ్ కూడా ఇలా వస్తాయని ఊహించి ఉండడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏరియాల వారీగా `గని` 2 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: రూ. 1.10 కోట్లు
సీడెడ్: రూ. 36 లక్షలు
ఉత్తరాంధ్ర: రూ. 49 లక్షలు
తూర్పు: రూ. 24 లక్షలు
పశ్చిమ: రూ. 15 లక్షలు
గుంటూరు: రూ. 22 లక్షలు
కృష్ణ: రూ. 22 లక్షలు
నెల్లూరు: రూ. 14 లక్షలు
————————–
ఏపీ+తెలుంగాణ మొత్త= రూ. 2.94కోట్లు(రూ. 5.35 కోట్లు~ గ్రాస్)
————————–
కార్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.20 కోట్లు
ఓవర్సీస్: రూ. 0.25 కోట్లు
—————————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: రూ. 3.39 కోట్లు(రూ.6.35కోట్లు~గ్రాస్)
—————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 25.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. రూ. 26.30 కోట్ల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగింది. కానీ, మొదట రెండు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే.. వరుణ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.