Ileana: గోవా బ్యూటీ ఇలియానా అందరికీ సుపరిచితురాలే. 2005వ సంవత్సరంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని మొదటి సినిమా “దేవదాసు”లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన “పోకిరి” సినిమాలో హీరోయిన్ గా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకోవడం జరిగింది. దీంతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ… ఇంకా చాలామంది హీరోలతో సినిమాలు చేయడం జరిగింది.
తెలుగులో మాత్రమే కాదు సౌత్ లో మరికొన్ని ఇండస్ట్రీలలో కూడా నటించడం జరిగింది. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. ఆ సమయంలో దక్షిణాది ఇండస్ట్రీని పట్టించుకోని ఇలియానా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పరాజయాలు పలకరించడంతో గోవా బ్యూటీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇదే సమయంలో ప్రేమ కూడా విఫలం కావడంతో.. ఇలియానా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చాలా లావు అయిపోయి.. అందం మొత్తం కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ తేరుకుని అవకాశాలు అందుకునే సోషల్ మీడియాలో.. రకరకాల ఫోటోలు అప్లోడ్ చేసి..తన ఫిట్ నెస్ చూపిస్తూ ఆకట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులను ఎప్పుడు ఇలియానా అలరిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా తాను గర్భవతి అయినట్లు.. త్వరలోనే డెలివరీ కాబోతున్నట్లు పాపని కానటానికి సిద్ధంగా ఉన్నట్లు… బేబీ ని చూడటానికి ఎంతో ఆత్రుతగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పెళ్లి కాకుండానే ఇలియానా గర్భవతి కావడంతో.. ఈ పోస్ట్ పై తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇలియానా గర్భవతి కారకుడు హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు అని టాక్. కత్రినా తమ్ముడు సేభాష్టియన్ లారెన్డ్ మైఖేల్ తో ఏడాది నుండి ఇలియానా డేటింగ్ చేస్తూ ఉంది. అతని కారణంగానే ఇలియానా తల్లి అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.