NewsOrbit
న్యూస్ సినిమా

God Father: షెడ్యూల్ పూర్తి..సల్మాన్ గురించి దర్శకుడేమన్నాడంటే..!

God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రాలలో గాడ్ ఫాదర్ ఒకటి. ఈ సినిమాను మలయాళం బ్లాక్ బస్టర్ లూసీఫర్ కు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా రూపొందిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో ఇక్కడ చిరు కనిపిస్తున్నారు. తెలుగు రీమేక్ కోసం ముందు సాహో దర్శకుడు సుజీత్, వి వి వినాయక్ కొన్ని నెలలు వర్క్ చేశారు. కానీ, ఆ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ చిరుకు నచ్చలేదు. దాంతో ఫైనల్‌గా ఈ కథకు తెలుగులో మార్పులు చేర్పులు చేసేందుకు తమిళ దర్శకుడు మోహన్ రాజాను ఎంచుకున్నారు.

god-father-schedule is completed
god father schedule is completed

మెగాస్టార్ సూచనల మేరకు మోహన్ రాజా చేసిన మార్పులు చిరును మెప్పించాయి. దాంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ముంబైలో ఓ షెడ్యూల్ మొదలు పెట్టిన చిత్రబృందం తాజాగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ మీద కీలక సన్నివేశాలను కంప్లీట్ చేశారు. సల్మాన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు.

God Father: అనుకున్నట్టు పూర్తైతే జూన్‌లో విడుదల..!

ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా చిరు – సల్మాన్ ఖాన్‌లపై ఓ మాస్ సాంగ్ కూడా ఉంటుందని ఇంతక ముందే చెప్పాడు. మరి ఆ సాంగ్‌ను తాజాగా కంప్లీట్ అయిన షూట్‌లో కంప్లీట్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక తాజా షెడ్యూల్ గురించి దర్శకుడు మోహన్ రాజా సల్మాన్‌తో ఈ షెడ్యూల్‌ లో పొందిన అనుభవాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే జూన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju