God Father: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ‘సైరా నరసింహా రెడ్డి’ లాంటి హిస్టారికల్ మూవీ తరువాత ఆయన వరుసగా 5 మాస్ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలను చేస్తూ ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలలో ఇప్పటికే ‘ఆచార్య’ మూవీ చిత్రీకరణ పూర్తయింది. భారీ స్థాయిలో ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించారు. ఈ క్రమంలో మిగతా చిత్రాలు షూటింగ్ దశలో వున్నాయి.
ఇక మలయాళ హిట్ సాధించిన చిత్రం ‘లూసీఫర్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రకటించి నప్పటి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, నయతార కీలక పాత్రలలో నటిస్తు న్నారు. అగ్ర నిర్మాత ఆర్. బి. చౌదరి సమర్పణలో ఎ.ఎన్. వి. ప్రసాద్ పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నా రు. ఇటీవలే హైదరాబాద్లో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
God Father: వీరిపై ఓ మాస్ సాంగ్ కూడా ఉండబోతోంది.
మెగాస్టార్ – సల్మాన్ ఖాన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముంబైలో వీరిద్దరికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం ముంబై వెళ్లిన చిరు.. సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో వున్నారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి – సల్మాన్ ఖాన్ పాల్గొనగా కీలక సన్నివేశాలని ముంబై సమీపంలో గల కజరత్ లో ఉన్న ఎన్ డీ స్టూడియోలో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆ స్టూడియోలో సెట్ ని నిర్మించి అందులోనే చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై మధ్య సన్నివేశాలని ఈ సోమవారం నుంచి చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇక వీరిపై ఓ మాస్ సాంగ్ కూడా ఉండబోతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?