మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాడ్ ఫాదర్”. “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. కమెడియన్ సునీల్ కూడా చాలా కాలం తర్వాత చిరంజీవి పక్కన లాంగ్ లెన్త్ రోల్ చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం సినిమాకి సంబంధించి విడుదల చేసిన వీడియో బట్టి అర్థమవుతుంది. అప్పట్లో విడుదల చేసిన ఫస్ట్ లుక్ వీడియోలో “గాడ్ ఫాదర్” దసరాకి రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆగస్టు 22వ తారీకు చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే “గాడ్ ఫాదర్” టీజర్ విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 21వ తారీకు నాడు “గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. “గాడ్ ఫాదర్” లో ఓ రాజకీయ పార్టీ అధినేతగా చిరంజీవి నటిస్తున్నట్లు టాక్.
ఇక ఇదే సినిమాలో స్పెషల్ రోల్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపించనున్నారు. “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో “గాడ్ ఫాదర్” తో అభిమానులను అలరించడానికి చిరంజీవి ఎంతగానో కృషి చేస్తున్నరు. ఇక చిరంజీవి పుట్టిన రోజు నాడే “గాడ్ ఫాదర్” విడుదల తేదీ కూడా రానున్నట్లు టాక్. ఇక ఇదే రోజు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళాశంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి అప్ డేట్ లు రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!