Good Luck Sakhi Movie: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన చిత్రం `గుడ్ లక్ సఖి`. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 28న గ్రాండ్‌గా విడుదలై.. నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన తండా అమ్మాయి సఖి జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా మారిందనేది ఈ సినిమా కథ. టాక్ సరిగ్గా లేకపోయినా కీర్తి సురేష్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఇంపాక్ట్ ని చూపుతుందని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. దాంతో గుడ్ లక్ సఖి 2 డేస్ కలెక్షన్స్ చాలా అంటే చాలా దారుణంగా వచ్చాయి.
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో రూ. 13 లక్షల షేర్ ని, వరల్డ్ వైడ్ గా రూ. 15 లక్షల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం.. సెకెండ్ డే రూ. 10 లక్షల కన్నా తక్కువ కలెక్షన్స్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో ఇప్పటి వరకు గుడ్ లక్ సఖి చిత్రం మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో రూ.23 లక్షల రేంజ్ షేర్ ని, వరల్డ్ వైడ్ గా రూ.26 లక్షల రేంజ్ లక్షన్స్ ని మరియు రూ.50 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇదే ఫ్లో కంటిన్యూ అయితే గుడ్ లక్ సఖి నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!