న్యూస్ సినిమా

సినీ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఓటీటీలో రిలీజైన ధనుష్ మూవీ..! 

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఎమోషనల్ హిట్ సినిమా ‘తిరు’ కూడా ఒకటి. టాలీవుడ్‌లో ధనుష్ నటించిన ‘తిరు’ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూడని కొంతమంది మంచి సినిమా థియేటర్స్‌లో చూడటం మిస్ అయ్యామే అని బాగా ఫీల్ అయ్యారు. కనీసం ఓటీటీలో అయినా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నారు.

ఓటీటీలో రిలీజైన ధనుష్ మూవీ

Dhanush

ఇప్పుడు అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ అందింది. ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా ఈ రోజే ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సన్ నెక్స్ట్ లో ‘తిరు’ సినిమాని తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేశారు. దాంతో ధనుష్ అభిమానులందరూ బాగా సంతోష పడుతున్నారు. హెచ్‌డీ క్వాలిటీలో ఈ సినిమాని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా, తిరు సినిమాని థియేటర్స్‌లో చూసిన వారు కూడా ఇంకోసారి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

సూపర్ సినిమా.. మిస్ కాకండి

Thiru Movie

ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా.. నిత్య మీనన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. తిరు సినిమా కీ మిత్రన్ దర్శకత్వం వహించగా, అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే రూ.110 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్‌గా ఉన్నా మనసులను హత్తుకుంటుంది. ఒక సగటు మనిషి జీవితంలో రోజు ఏం జరుగుతాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? వంటివన్నీ ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అందుకే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.


Share

Related posts

Energy Drink: ఇది ఒక గ్లాస్ తాగితే ఎనర్జీ అంతా మీదే..!

bharani jella

Inter Exams: బిగ్ బ్రేకింగ్.. ఏపిలో ఇంటర్ పరీక్షలు వాయిదా..!!

somaraju sharma

డొల్ల కంపెనీలతో డిహెచ్ఎఫ్ఎల్ 31వేల కోట్లు లూటీ

somaraju sharma