సినిమా

SVP: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ “సర్కారు వారి పాట” కి సంబంధించి మరో సాంగ్ రిలీజ్..!!

Share

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నడుస్తుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా “సర్కారు వారి పాట” విడుదల కావటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. సెప్టెంబర్ 12 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ అదిరిపోయే కామెడీ టైం..తో పాటు సరికొత్త స్టోరీ లైన్ కావడంతో SVP అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కీర్తి సురేష్ …మహేష్ కామెడీ ట్రాక్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్ కి పోటెత్తుతున్నారు.

Good News for Mahesh Fans Another song release related to Sarkaru Vari Pata

వీకెండ్ కావడంతో “సర్కారు వారి పాట” థియేటర్ లు హౌస్ ఫుల్ కలెక్షన్ లతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా సినిమాలో మహేష్ డాన్స్ అదరగొట్టడంతో… ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమాకి సంబంధించిన రప్ సాంగ్..ఉందని.. స్టార్టింగ్ లో చెప్పారు. సినిమా రిలీజయ్యాక విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రామిస్ చేశారు.కాగా సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే గతంలో మాట ఇచ్చినట్టుగానే రప్ సాంగ్ మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు.

సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో.. చాలామంది మ్యూజిక్ ట్రాక్ బాగుందని..తమన్ అదరగొట్టాడంటూ.. చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో “సర్కారు వారి పాట” బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ తో ఈ రప్ సాంగ్ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కళావతి, పెన్నీ పాటలు మాదిరిగానే రప్ పాటకి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో… అభిమానులు అన్ని రకాలుగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పుడు కోవిడ్ తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ పడటంతో మహేష్ కూడా సర్దార్ వారి పాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Mahesh : మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్..!!

sekhar

Cab Stories: “క్యాబ్ స్టోరీస్” వీరి జీవితాలను మలుపు తిప్పే కథ తెలియాలంటే టీజర్ చూడాల్సిందే..!!

bharani jella

మహేష్ ని అలా నేను చూడలేను అంటున్న నమ్రత..!!

sekhar