33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… “SSMB 28” ఫస్ట్ లుక్ డీటైల్స్..?

Share

SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరి నెలలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి చాలా నెలలు టైం పట్టింది. మధ్యలో మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించడంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో.. షూటింగ్ లు వాయిదా పడుతూ వచ్చాయి. ఇదే సమయంలో హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడం..జరిగింది. దీంతో ఆమె అనేక నెలలు బెడ్ రెస్ట్ కి పరిమితం అయింది.

Good news for Mahesh fans SSMB 28 first look details

ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత నుండి షూటింగ్ నిరంతరంగా జరుపుకుంటుంది. వాస్తవానికి “SSMB 28” ఈ ఏడాది ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. గతంలో అధికారిక ప్రకటన తో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఇప్పుడు ఆగస్టు నెలకి సినిమా వాయిదా వేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మార్చి 22వ తారీకు ఉగాది పండుగ నేపథ్యంలో “SSMB 28” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. మూవీ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది రోజు.. విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Good news for Mahesh fans SSMB 28 first look details

ఈ సినిమాలో శ్రీలీలా కూడా కీలకపాత్ర పోషిస్తూ ఉంది. మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇది మూడవ సినిమా కావటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబుని చాలా వ్యత్యాసంగా త్రివిక్రమ్ చూపించారు. మరి మూడో సినిమాలో మహేష్ ని ఎలా చూపిస్తాడో అన్నది అభిమానులలో ఆసక్తికరంగా ఉంది.


Share

Related posts

Anushka : అనుష్క ఏం చెప్పడం లేదంటే ..ఇక అన్ని వదిలేసినట్టేనా ..?

GRK

Narappa : నారప్ప ఇండస్ట్రీ హిట్ అంటున్నారు.. వెంకీ ఖాతాలో హ్యాట్రిక్ హిట్..!

GRK

కర్నూలులో తన అభిమాని కోరిక నెరవేర్చిన బాలయ్య బాబు..!!

sekhar