Megastar: నిజంగా ఇది మెగా ఫ్యాన్స్‌కు బంగారం లాంటి వార్త అని చెప్పాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నిటినీ వరుసగా రిలీజ్ చేసేలా ఆయన ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది మెగాస్టారే అన్నీ రికార్డులు క్రియేట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రెండేళ్లలో అంటే 2022, 23లలో చిరు నుంచి ఏకంగా 7 చిత్రాలు రాబోతున్నాయని లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే విడుదల కావాల్సిన ఆచార్య సినిమా వాయిదా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మళ్ళీ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
దీనితో కలిసి ఇంకా మొదలవని మారుతి, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాల వరకు చిరంజీవి చేయనున్న సినిమాలన్నీ ఈ ఏడాదిలో అలాగే వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శక, నిర్మాతలకు చిరు సూచించారట. వీలైనంత త్వరగా మెగాస్టార్ 175 సినిమాలను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే చక చకా సినిమాలను కమిటవుతూ వాటిని పూర్తి చేస్తూన్నారు. ఆచార్య తర్వాత రాబోయో సినిమా గాడ్ ఫాదర్.
Megastar: 2022, 23లలో మెగా ట్రీట్ అదిరిపోతుంది.
ఈ సినిమాను మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ ఇందులో నటిస్తుండగా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా రానుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతుంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విడుదల కానుందట. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మారుతి, వెంకీ కుడుముల చిత్రాలు కూడా 2023లో రానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి 2022, 23లలో మెగా ట్రీట్ అదిరిపోతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?