NBK: నట సింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 107” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. కర్నూల్ లో మొన్నటి వరకు కొన్ని భావోద్వేగాకరమైన సన్నివేశాలతో పాటు పాటలు ఇంకా ఫైట్స్ చిత్రీకరించారు. ఆ తర్వాత టర్కీ వెళ్లడం జరిగింది. ఈ సినిమా డిసెంబర్ నెలలో లేదా సంక్రాంతి పండుగకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే బాలకృష్ణ ఆహా ఓటీటిలో హోస్ట్ గా “అన్ స్టాపబుల్” టాకీ షోతో గతంలో అలరించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే త్వరలో సెకండ్ సీజన్ ప్రారంభంలో కానున్నట్లు ఇప్పటికే ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇటువంటి తరుణంలో సెకండ్ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 4వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన బాలయ్య బాబు బ్యాక్ లుక్ ఫోటో రిలీజ్ చేసింది. “NBK IS BACK” అంటూ బాలయ్య బాబు క్యాప్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఈ ఏడాదిలో ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అంతకు ముందు బాలయ్య బాబును ఈ విధంగా ఎప్పుడు చూసి ఉండరు అని పేర్కొంది.
సెకండ్ సీజన్ లో బిగ్గెస్ట్ సినీ ప్రముఖులతోపాటు పొలిటికల్ లీడర్స్ కూడా రానున్నట్లు సమాచారం. ఈసారి ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరి కొంతమంది పెద్ద స్టార్ లు తీసుకురావడానికి ఆహా ప్లాన్ చేసింది. ఇక రాజకీయంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. “అన్ స్థాపబుల్” సెకండ్ సీజన్ మొదటి దానికంటే గ్రాండ్ గా ఉండే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.