Unstoppable 2: ఆహా ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్” టాకీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్ గా బాలయ్య అందరి అభిమానాలను సంపాదిస్తున్నారు. హోస్ట్ గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. “అన్ స్టాపబుల్” టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ… మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ల జీవితానికి సంబంధించి.. కాంట్రవర్సీ ప్రశ్నలను కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు.
“అన్ స్టాపబుల్” మొదటి సీజన్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్ గా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను షోలోకీ తీసుకురావడం జరిగింది. ఇక ఇదే సమయంలో చాలా బిగ్ స్టార్ లు వస్తున్నారు. మొదటి సీజన్ చివర ఆఖరికి వచ్చేసరికి మహేష్ రాగా సెకండ్ సీజన్.. చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ షోకి రావటం జరిగింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ మరియు క్రిష్ కూడా వస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో “అన్ స్టాపబుల్” పవన్… బాలయ్య ఎపిసోడ్ లకీ సంబంధించి పవర్ స్టార్ నేడు ఆహా టీం రిలీజ్ చేయటానికి సిద్ధమైనట్టు సమాచారం. సరిగ్గా న్యూ ఇయర్ కి ముందు… బాలకృష్ణ పవన్..”అన్ స్టాపబుల్” ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటివరకు ఒకే ఫ్రేమ్ లో కనిపించిన దాఖలాలు లేవు. దీంతో పవన్ బాలకృష్ణ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఆసక్తి నెలకొంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!