Unstoppable 2: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ బిగ్గెస్ట్ టాకీ షో “అన్ స్టాపబుల్”. ఈ షో స్టార్ట్ అయి ఏడాదిలోనే దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీనికి ప్రధాన కారణం హోస్ట్ బాలకృష్ణ. నటుడిగా కంటే యాంకర్ గా బాలయ్య బాబు ఈ షో ద్వారా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. ఆయనను విభేదించేవారు సైతం ఈ షో చూశాక బాలయ్య అభిమానులు అయిపోతున్నారు. గత ఏడాది మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి. దీంతో సెకండ్ సీజన్ మొదటి దానికంటే మరింత గ్రాండ్ గా ఉండాలని వీక్షకులను అలరించాలని… వెరైటీగా సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులను కూడా తీసుకొచ్చారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి.
స్టార్టింగ్ చంద్రబాబు ఎపిసోడ్ మొదలుకొని మొన్న ప్రభాస్ ఎపిసోడ్ వరకు చాలా వరకు హైలెట్ అయ్యాయి. ప్రభాస్ మరియు గోపీచంద్ ఎపిసోడ్ ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రావడం తెలిసిందే. ఇంకా ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ సంక్రాంతి పండుగ వచ్చినా గాని ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ లేటెస్ట్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కీ సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఆహా టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుందో తెలుస్తుంది. పొలిటికల్ గా మరియు వ్యక్తిగతంగా అనేక ప్రశ్నలు బాలయ్య… పవన్ కళ్యాణ్ ని అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు గురించి బాలకృష్ణ ప్రశ్నించినట్లు పవన్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి బాలయ్య.. పవన్ “అన్ స్టాపబుల్” గ్లింప్స్ ఏ రీతిగా అభిమానులను అలరిస్తుందో చూడాలి.
Let the Sankranti celebrations begin early⚡️⭐️. The most anticipated glimpse of PSPK x NBK will be out at 11 AM tomorrow🥳#PawanKalyanOnAHA #PspkOnAHA #UnstoppableWithNBKS2 #NandamuriBalakrishna #NBKOnAHA@PawanKalyan pic.twitter.com/FeWwIrwlTi
— ahavideoin (@ahavideoIN) January 14, 2023