Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో జయప్రజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు కలెక్షన్స్ సాధిస్తాయి. ఇంకా ఓపెనింగ్స్ అయితే పవన్ కి వచ్చినట్టు మరో హీరోకి రావని చెప్పవచ్చు. ఏం మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు చేల్లా చెదిరిపోతాయి. ఇదిలా ఉంటే పవన్ కొడుకు అకిరా నందన్ ఏప్రిల్ ఏడవ తారీఖు బర్తడే తో 19 వ సంవత్సరంలో అడుగు పెట్టడం తెలిసిందే. దీంతో పవన్ వారసుడిగా అకిరా నందన్ సినిమా ఎంట్రీ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటినుండో డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు అకిరా నందన్ ఊహించని షాక్ ఇవ్వడం జరిగిందట. మేటర్ లోకి వెళ్తే హీరోగా కాకుండా మ్యూజిక్ దర్శకుడుగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అంట. ఆల్రెడీ ఇటీవల ఒక షార్ట్ ఫిలిం కి అకిరానందన్ మ్యూజిక్ అందించడం జరిగిందట. రైటర్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం కి అకిరా నందన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మ్యూజిక్ వినడం జరిగింది అదిరిపోయేటట్టు బాణీలు ఉన్నాయని అడవి శేష్ చెప్పుకొచ్చారు. దీంతో హీరోగా చూడాలని… అనుకుంటున్నా పవన్ అభిమానులకు అకిరా నిరాశ మిగిల్చడం జరిగింది.
కానీ ఫ్యాన్స్ నుండి వచ్చే ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ బట్టి అకిరా సినిమా హీరోగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ అకిరా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. గ్లామర్ పరంగా కూడా తల్లి రేణు దేశాయ్ మాదిరిగా.. ఉండటంతో పాటు పవన్ మేనరిజం లుక్స్ అకిరాలో ఉంటాయని కచ్చితంగా ఇది హీరో మెటీరియల్ అని.. అభిమానులు అంటున్నారు. మరోపక్క అఖీరా మాత్రం మ్యూజిక్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.