NewsOrbit
Entertainment News సినిమా

Ram Navami: శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “ఆది పురుష్” నుండి మరో అప్ డేట్..!!

Share

Ram Navami: నేడు శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే జూన్ నెలలో రిలీజ్ గానుంది. వాస్తవానికి ఈ సినిమా జనవరిలో విడుదల కావాల్సింది. కానీ సినిమాలో గ్రాఫిక్స్ చాలా చండాలంగా ఉండటంతో అభిమానుల నుండి భారీ ఎత్తున నెగెటివిటీ వచ్చింది.

Image

దీంతో ఇప్పుడు సినిమా గ్రాఫిక్స్ మొత్తం మారుస్తూ జూన్ నెలలో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శ్రీరామ నవమి నుండి “ఆది పురుష్” నుండి అప్ డేట్స్ వస్తుంటాయని అభిమానులకు దర్శకుడు ఓం రౌత్ తెలియజేయడం జరిగింది. అయితే నేడు చెప్పినట్టుగానే పండుగ సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. “ఆదిపురుష్” నుండి మరో అప్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్ లో సీతారాములుగా ప్రభాస్, కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు.. అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు.

Adipurush

శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. మరోపక్క ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. సో ఈ ఏడాది ప్రభాస్ రెండు సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురష్ నుండి విడుదలైన ఫోటో పట్ల అభిమానులు పరవాలేదని కామెంట్లు పెడుతున్నారు.


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా సినిమాకి సీనియర్ దర్శకుడు అవసరం..!

GRK

రమ్యకృష్ణ తన రేటు చెప్పేసరికి త్రివిక్రమ్ నోట మాట రాలేదు…?

arun kanna

Shirin Kanchwala Cute Photos

Gallery Desk