Project K: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కీ సరిగ్గా ఒక హిట్టు కూడా పడలేదు. “బాహుబలి” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత నటించిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరోపక్క కరోనా రావటంతో రెండు సంవత్సరాలు గ్యాప్.. రావటం అభిమానులను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్” మొదటి టీజర్ ఎంతో నెగిటివిటీని మూటగట్టుకుంది. దీంతో ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ నెలకి వాయిదా పడింది. మొత్తం గ్రాఫిక్స్ వర్క్ అంత మార్చేస్తున్నారు.

ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ రెండిటిలో “సలార్” ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. కాగా ఇప్పుడు “ప్రాజెక్ట్ కే” సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. శివరాత్రి సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు “ప్రాజెక్ట్ కే” రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తుందని పోస్టర్ లో ఉండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

వైజయంతి వంటి భారీ నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా…ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుపుకుంటుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్ర చేస్తున్నారు. సూపర్ హీరోస్ నేపథ్యం కలిగిన.. స్పైడర్ మాన్, సూపర్ మాన్ ఫ్లేవర్ కంటెంట్ కలిగిన సినిమా అని అంటున్నారు. శివరాత్రి సందర్భంగా రిలీజ్ డేట్ మరియు పోస్టర్ విడుదల చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.