Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి 2” లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించింది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కానీ “బాహుబలి 2” తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ కి హిట్ పడలేదు. సాహో, రాదేష్యం…రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
దాదాపు ఈ రెండు సినిమాలకు నాలుగు సంవత్సరాలు టైం పట్టింది. ఫలితాలు వచ్చేసరికి మొదటి షో కి అట్టర్ ప్లాప్టాకులు రావడం ప్రభాస్ టైం వేస్ట్ కావటం అభిమానులకు ఎంతో నిత్సాహం కలిగించింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేజిఎఫ్, కేజిఎఫ్ 2 వంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ “సలార్” అనే సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నది. ప్రభాస్ కి జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ ని చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభాస్ బర్తడే నాడు పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన సినిమా యూనిట్ చేయటం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా “సలార్” సినిమా నిర్మాత షూటింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. “సలార్” సినిమా షూటింగ్ 85% కంప్లీట్ అయిపోయిందని తెలిపారు. మిగతా బ్యాలెన్స్ షూటింగ్ జనవరిలో కంప్లీట్ చేసి VFX కి ఆరు నెలలు టైం కేటాయిస్తున్నట్లు నిర్మాత విజయ్ కిరగం దూర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మూవీ రషస్ చూడడం జరిగింది. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. కచ్చితంగా చెప్పిన టైంకి సెప్టెంబర్ 28వ తారీకు వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని హామీ ఇచ్చారు.