NewsOrbit
Entertainment News సినిమా

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…”సలార్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Share

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “సలార్” కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో డిసెంబర్ కి వాయిదా పడింది. “కేజిఎఫ్” తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ “సలార్” సినిమా యూనిట్ విడుదల చేయలేదు. ఈ క్రమంలో తాజాగా డిసెంబర్ మొదటి తారీకు “సలార్” విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతుందట.

Good news for Prabhas fans Salaar trailer release date fixed

డిసెంబర్ 22వ తారీకు “సలార్” విడుదల తేదీ ఆల్రెడీ ప్రకటించడం తెలిసిందే. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. మొదటి భాగం డిసెంబర్ తర్వాత రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ మాస్ పాత్రలో… పవర్ ఫుల్ గా కనిపించనున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో సలార్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Good news for Prabhas fans Salaar trailer release date fixed

అంతకుముందు ప్రశాంత్ నీల్ తీసిన కేజిఎఫ్… రెండు భాగాలు దేశంలోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. హీరో యాష్ కి మంచి ఇమేజ్ రావటం జరిగింది. అటువంటి దర్శకుడు.. ప్రభాస్ తో సినిమా చేస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా కూడా “సలార్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సౌత్ లో మలయాళం ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం “సలార్” పలు కీలకపాత్రలు పోషించడం జరిగింది. ప్రభాస్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ పైనే పెట్టుకోవడం జరిగింది.


Share

Related posts

Narne Nithiin: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. ఆక‌ట్టుకుంటున్న‌ ఫ‌స్ట్ లుక్‌!

kavya N

బిగ్ బాస్ 4 : అఖిల్ తో పెళ్ళి గురించి చర్చించిన మోనాల్..! పగలబడి నవ్విన సోహెల్

arun kanna

రజనీకాంత్ అన్నాత్తే సినిమాకి రాజకీయాలకి ముడిపడింది.. ఈ సినిమా చరిత్రలో నిలుస్తుందట ..?

GRK