Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. కూతురు పుట్టడం అంతకుముందు “RRR” సినిమా ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో.. వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో చరణ్ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడటం తెలిసిందే. ఈ క్రమంలో శంకర్ “ఇండియన్ 2” బ్యాలెన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు.
గత ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాదా మరో రెండు నెలలలో ఈ ఏడాది ముగుస్తున్న గాని.. ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయకపోవడం పట్ల అభిమానులు ఎంతో నిరుత్సాహం చెందారు. ఇటీవల చరణ్ ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో దర్శకుడు శంకర్ మరియు నిర్మాత దిల్ రాజు పై సీరియస్ కావడం కూడా జరిగింది. అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో.. తాజాగా గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో అక్టోబర్ 9 వ తారీఖు నుండి స్టార్ట్ చేయటం జరిగింది. ఈ షెడ్యూల్ లో సినిమాలో ఓ భావోద్వేగా భరిత సన్నివేశానికి సంబంధించి.. చిత్రీకరణ సాగుతోంది.
కొత్త షెడ్యూల్ వివరాలను డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. సినిమాకి కీలక సన్నివేశం సెంటిమెంట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓ వర్కింగ్ స్టిల్ కూడా విడుదల చేయడం జరిగింది. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో… చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నరు.ఈ సినిమాలో చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు తండ్రి ప్రతి శ్వాస విడవటంతో నేడు చరణ్ పరామర్శించడం జరిగింది.