Ram charan: ఆర్ఆర్ఆర్ పోస్ట్‌పోన్ అని డీలా పడ్డ చరణ్ ఫ్యాన్స్‌కు ఇదిగో గుడ్‌న్యూస్

Share

Ram charan: ఆర్ఆర్ఆర్ పోస్ట్‌పోన్ అని డీలా పడ్డ చరణ్ ఫ్యాన్స్‌కు ఇదిగో గుడ్‌న్యూస్..నిజంగా ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్..గత మూడేళ్ళ నుంచి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉండిపోయారు. ఈ సినిమా కమిటవడం వల్ల మరో సినిమాను కమిటవడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా జరుగుతుందని తారక్, చరణ్ ఊహించలేదు. కరోనా వేవ్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు కోలుకోలేని దెబ్బకొట్టాయి. అన్నీ పరిస్థితులు చక్కబడ్డాయని సంతోషపడి నెలరోజుల నుంచి ప్రమోషన్స్ నిర్వహించారు.

good news for ram-charan-fans
good news for ram-charan-fans

సరిగ్గా రిలీజ్ సమయం దగ్గరపడగానే మరోసారి ఈ పాన్ ఇండియన్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన మెగా, నందమూరి అభిమానులకు ఇది మైండ్ బ్లాకయ్యే షాక్. ఈ షాక్ నుంచి అభిమానులను బయటపడేందుకు చరణ్ గుడ్‌న్యూస్ చెప్పినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కోసం ఇంతకాలం చరణ్ కూడా ఎదురుచూశారు. కానీ ఇప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో వెంటనే శంకర్ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకురావాలని రెడీ అయ్యారట.

Ram charan: అప్‌డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా ఆర్సీ 15 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దిల్ రాజు సంస్థకు 50వది కావడం విశేషం. అందుకే భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఓ భారీ ఫైట్ అలాగే చరణ్, కియారాలపై ఓ సాంగ్‌ను శంకర్ తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ సినిమాకు చరణ్ బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆగిపోవడంతో తన సినిమాను మొదలుపెట్టబోతున్నారు. అలాగే అప్‌డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇది మెగా ఫ్యాన్స్‌కు కాస్త ఊరట అని చెప్పాలి.


Share

Related posts

అక్కడ ఎలాంటి నమ్మకం పెట్టుకోవద్దు అంటూ మెగా మేనల్లుడికి ముందే హెచ్చరిస్తున్నారా ..?

GRK

వాళ్లల్లో ఒకరికే ఛాన్స్ ఇవ్వబోతున్న ప్రభాస్..??

sekhar

Aathmika New Gallerys

Gallery Desk