NewsOrbit
Entertainment News సినిమా

Salaar: సలార్ వాయిదా పడింది అని తల పట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్లో కూడా నమ్మలేని గుడ్ న్యూస్ !

Advertisements
Share

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించాక హిట్ అందుకోవటానికి ప్రభాస్ నానా తంటాలు పడుతున్నారు. “బాహుబలి” సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు పాటు టైం తీసుకున్నా నేపథ్యంలో.. మరోపక్క అభిమానులకు చిరాకు తెప్పిస్తుంది. అయితే ఈ ఏడాది “ఆదిపురుష్” జూన్ నెలలో విడుదలై అట్టర్ ప్లాప్ కాగా.. అభిమానులు ఎంతో నిరోత్సాహం చెందారు. ఈ క్రమంలోనే ఈ నిరాశ నుండి అభిమానులలో హుషారు తీసుకొచ్చే రీతిలో ప్రభాస్ తెలివిగా “సలార్” టీజర్ రిలీజ్ చేసి కొంత ఉపశమనం కలిగించారు. ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” రిలీజ్ చేయబోతున్నట్లు… రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

Advertisements

good news to fans Prabhas is going to complete the film Spirit within six months

అయితే మరి కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని టీజర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు.. సలార్ వాయిదా వార్తలు.. తల పట్టుకునేటట్లు చేస్తున్నాయి. విడుదల చేస్తామని ప్రకటించడం దేనికి ఇప్పుడు వాయిదా పడే రీతిలో సినిమా యూనిట్ వ్యవహరించటం.. దారుణమని అంటున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ప్రభాస్ నుండి కలలో కూడా ఊహించని నమ్మలేని గుడ్ న్యూస్ రెడీ కాబోతుందట. మేటర్ లోకి వెళ్తే “సలార్”తర్వాత నెక్స్ట్ చేయబోతున్న సినిమాని ఆరు నెలలలో కంప్లీట్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. విషయంలోకి వెళ్తే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే “స్పిరిట్” సినిమాని ఆరు నెలలలోనే పూర్తి చేయాలని కండిషన్ పెట్టడం జరిగిందట. ప్రస్తుతం సందీప్ వంగ “యానిమల్” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

Advertisements

good news to fans Prabhas is going to complete the film Spirit within six months

ఆ తర్వాత వెంటనే ప్రభాస్ తో చేయబోయే “స్పిరిట్” ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్. ప్రభాస్ ఆరు నెలలు అనే కండిషన్ పెట్టడంతో సందీప్ వంగా కూడా త్వరగానే ఈ సినిమాని పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఈ ఏడాది చివర సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా లోపు సినిమా విడుదల చేయాలనే ప్లానింగ్ లోనే ఉన్నారట. చాలా డిఫరెంట్ జోనర్ కంటెంట్ తో… ప్రభాస్ ని అత్యద్భుతంగా చూపించే రీతిలో స్క్రిప్ట్ సందీప్ వంగ సిద్ధం చేసినట్లు సమాచారం. తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమాలు ఒక్కోదానికి రెండు సంవత్సరాలు పడుతున్నట్లు బాధపడుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఆరు నెలలలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు అంట. ఇది డార్లింగ్ అభిమానులకు కచ్చితంగా నమ్మలేని గుడ్ న్యూస్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.


Share
Advertisements

Related posts

24 ఏళ్ల ‘నిన్నేపెళ్లాడతా’.. కృష్ణవంశీ తెర వెనక కథ ఇదీ..

Muraliak

ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న హీరోయిన్ ఖ‌రారైందా?

Siva Prasad

సుడిగాలి సుదీర్ అభిమానులపై సీరియస్ అయినా డైరెక్టర్..!!

sekhar