Ram Charan: రామ్ చరణ్.. పరిచయం అక్కర్లేని పేరు. పేరుకి మెగాస్టార్ కొడుకైనప్పటికీ ఓ స్టార్ గా ఎదగడానికి చరణ్ కి అనేక సంవత్సరాలు పట్టింది. రంగస్థలం అనే సినిమాతోనే చరణ్ లోని నటుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇక తాజా సినిమా RRR విడుదలకు రెడీ గా వుంది. కరోనా కష్టకాలం వలన వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ – చరణ్ కాంబో కోసం ఆయా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Bunny NTR: బన్నీ, ఎన్టీఆర్ జపం చేస్తున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్..!!
Ram Charan: ఆ దర్శకుడు ఎవరో తెలుసా?
సితార బ్యానర్ నిర్మాతలు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. వారి తాజా చిత్రం ‘డీజే టిల్లు’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరి నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఓ మీడియా వేదికగా అనేక విషయాలు మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం అదృష్టమని, దీనికి దర్శకుడు త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేయడం కూడా అదృష్టమని అన్నారు. అలాగే తరువాత వారి బేనర్లో త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబోలో సినిమా రాబోతోందని చెప్పుకొచ్చారు.
Tollywood: టాలీవుడ్ పరిస్థితి ఏమిటి? ఏపీ సర్కార్ ఎదుట మోకరిల్లిందా? గెలుపెవరిది?
సితార బ్యానర్ విశేషాలివే:
సితార బ్యానర్ చైర్మన్ అయినటువంటి S రాధా కృష్ణ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈయన మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ అధికారికంగా బయటకు రావాల్సి వుంది. ఆ తరువాత ఎన్టీఆర్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతన్ని బేసిగ్గా తెలుగు చిత్ర పరిశ్రమలో చినబాబు అని పిలుస్తూ వుంటారు. ఈయన 90sలోనే టాలీవుడ్లోకి అడుగు పెట్టారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!