మొద‌లైన గూఢ‌చారి 2 స్క్రిప్ట్ వ‌ర్క్

Share

ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచిన చిత్రం గూఢ‌చారి. అడ‌వి శేష్ హీరోగా న‌టించిన ఈ స్పై థ్రిల్ల‌ర్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధ‌మ‌వుతుంది. అడ‌వి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సీక్వెల్ గురించి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసారు యూనిట్. ఇప్ప‌టికే ఈ చిత్ర స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లైంది. 2019 మ‌ధ్య‌లో గూఢ‌చారి 2 షూటింగ్ మొద‌లు కానుంది. గూఢ‌చారి రెండో భాగం భారీ బ‌డ్జెట్.. అద్భుత‌మైన లొకేష‌న్స్.. పెద్ద స్కేల్లో రాబోతుంది. తొలి భాగం కంటే మంచి ఔట్ పుట్ తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. గూఢ‌చారి సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ లో అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2020లో ఈ సీక్వెల్ విడుద‌ల కానుంది. సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ తెలియ‌జేయ‌నుంది.

Share

Related posts

Pawan Kalyan : సూపర్ బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ తెలుసా? నరాలు నిక్కబొడుచుకుంటాయి!

Teja

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి జరిగినట్టే సుకుమార్ పుష్ప కి జరుగుతోంది ….?

GRK

అంతా వ‌ట్టిదే!

Siva Prasad

Leave a Comment