2004లో `కౌన్ హో గయా నా` సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్ ..ఉత్తరాదిన అవకాశాలు రాకపోవడంతో 2007లో తేజ డైరెక్ట్ చేసిన `లక్ష్మీ కల్యాణం`తో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపా దడపా హిందీ చిత్రాల్లో కూడా కాజల్ నటిస్తూ వస్తోంది. 14 ఏళ్ల కెరీర్లో కాజల్ 58 చిత్రాల్లో నటించిన కాజల్ ఇన్నేళ్లలో టాలీవుడ్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌తో మాత్రంనటించలేదు. ఎందుకు నటించలేదు? అనే కారణాలను పక్కన పెడితే.. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్, కాజల్ అగర్వాల్ కలిసి తెరపై సందడి చేయబోతున్నారట. రీసెంట్గా బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా గోపీచంద్ సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను నటింప చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే గోపీచంద్, కాజల్ జంటగా మెప్పిస్తారు. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
previous post
next post