NBK107: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాల మీద డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇక ఇదే సమయంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబుకి తాజాగా “అఖండ”తో మళ్లీ హిట్ రావడం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. కాగా ప్రస్తుతం బాలయ్య బాబు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
బాలయ్య బాబు కెరీర్ లోనే 107 ఓ సినిమాగా తెరకెక్కుతున్న.. ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ఇటీవల తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా లో స్టార్ట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా విషయంలో ఇప్పుడు సరికొత్త వార్త బయటపడుతుంది. మేటర్ లోకి వెళ్తే గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలయ్య బాబు ని డబల్ క్యారెక్టర్ లో చూపించనున్నాట్లు టాక్. విషయంలోకి వెళితే బాలయ్య బాబు ఒకటి మాస్ పాత్రలో మరొకటి క్లాస్ పాత్రలో… కనిపించనున్నట్లు సమాచారం.
బాలయ్య బాబు కెరీర్ లో చెన్నకేశవరెడ్డి, రాముడు భీముడు, ఆదిత్య 369, సింహ, అఖండ ఇంకా చాలా సినిమాల్లో బాలయ్య బాబు డబల్ క్యారెక్టర్లు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ఇదే సెంటిమెంట్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకి ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. వచ్చే దసరాకి సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో మరోపక్క అనిల్ రావిపూడి సినిమా కూడా త్వరగా స్టార్ట్ చేయాలని బాలయ్య బాబు డిసైడ్ అయినట్టు ఫిలింనగర్ టాక్.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!