న్యూస్ సినిమా

Balakrishna: ‘అఖండ’ సినిమాను మర్చిపోవాల్సిందే..బాలయ్య కోసం గోపీచంద్ ప్లాన్ బి అప్లై చేస్తున్నాడు

Share

Balakrishna: క్రాక్ సినిమాతో దర్శకుడు గోపీచంద్ మలినేని మూడేళ్ళ తర్వాత భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో హీరో మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ శృతి హాసన్ కూడా ఇదే మూడేళ్ళ గ్యాప్ తర్వాత సాలీడ్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కారు. దాంతో ఈ ముగ్గురు భారీ చిత్రాలను చేసే అవకాశాలను అందుకున్నారు. హీరోగా రవితేజ చేతిలో అరడజను సినిమాలున్నాయి. హీరోయిన్ శృతి హాసన్ చేతిలో పాన్ ఇండియన్ సినిమా సలార్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ కానుంది.

gopichand malineni planning big for balakrishna-
gopichand malineni planning big for balakrishna-

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్‌తో ఏకంగా నట సింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కొవిడ్ కారణంగా ఇంకా మొదలవలేదు. జనవరి 11 నుంచి సెట్స్ మీదకు రావాల్సిన ఈ సినిమా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నెలరోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 12 నుంచి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారట. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్‌లో ప్లాన్ చేశారట. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో కంప్లీట్ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం.

Balakrishna: అఖండ కంటే భారీ హిట్‌ను గోపీచంద్ మలినేని బాలయ్యకు ఇవ్వబోతున్నాడు.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ ను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. రవితేజ క్రాక్’ సినిమాలో వేట పాలెం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ సినిమాని కూడా వేటపాలెం నేపథ్యంలో జరిగిన యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకొనే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సన్నివేశాలను గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా కంటే రెట్టింపు స్థాయిలో ఉండేలా ప్లాన్ చేశాడట. ఇక బాలయ్య అంటే యాక్షన్స్ సీన్స్‌కు పెట్టింది పేరు. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలలో ఈ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతకు మించి ఇప్పుడు కొత్త సినిమాలో ఉండబోతున్నాయట. దీనిని బట్టి చూస్తే అఖండ కంటే భారీ హిట్‌ను గోపీచంద్ మలినేని బాలయ్యకు ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది.


Share

Related posts

Jagapathi Babu : మేకప్ మెన్ గా మారిపోయిన జగపతిబాబు… కారణం అదే!

Teja

చంద్రబాబు ని అరస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజల రియాక్షన్ ఏంటి ?

sekhar

క‌రోనా వ్యాక్సిన్‌… ఓ దిమ్మ‌తిరిగిపోయే వార్త‌

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar