Unstoppable 2: అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మరింత స్పీడ్ గా దూసుకుపోతుంది. ఈరోజు మధ్యాహ్నం నుండి ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ భారీ ఎత్తున వ్యూస్ రాబడుతూ.. రికార్డులు క్రియేట్ చేస్తుంది. సరిగ్గా గోపీచంద్ షోలోకి ఎంట్రీ ఇచ్చాక… ఆపేశారు. దీంతో ఈ రోజు సెకండ్ ఎపిసోడ్ గోపీచంద్ వచ్చాక… కంటిన్యూ అయిన షోని చూపించడం జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ముందు రిలీజ్ అయిన ప్రోమోలు షోపై గోపీచంద్ మరియు ప్రభాస్ అభిమానులకు మరింత ఇంట్రెస్ట్ కలిగించడం తెలిసిందే.
అయితే ఇండస్ట్రీలో వీరిద్దరూ మొదటినుండి మంచి ఫ్రెండ్స్ కావటంతో ఒకరి గురించి మరొకరి దగ్గర అనేక విషయాలు బాలకృష్ణ ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గోపీచంద్ కి కోపం వస్తే ఏం చేస్తాడని ప్రభాస్ ని అడిగారు. దానికి ప్రభాస్ సమాధానం ఇస్తూ..”ఒకసారి గోపీచంద్ ముక్కుకి దెబ్బ తగిలింది. నవ్వొచ్చినప్పుడు పక్కవారి భుజంపై కొట్టడం నాకు అలవాటు. అలా మాత్రం కొట్టొద్దని గోపీచంద్ నాకు ముందుగానే చెప్పేవాడు. కానీ కలిసి కారులో వెళ్తూ ఉండగా నాకు నవ్వు రాగానే నేను అతని భుజంపై గట్టిగానే కొట్టాను… అంతే పాపం ముక్కులో నుంచి రక్తం వచ్చేసింది.
ఆ టైంలో కూడా గోపీ నన్ను ఏమీ అనలేదు తనకి కోపం రాదు చాలా మంచోడు అని చెప్పుకోచ్చాడు. ఇక ప్రభాస్ కి కోపం వస్తే ఏం చేస్తాడు అని గోపీచంద్ ని బాలయ్య ప్రశ్నించడం జరిగింది. దానికి గోపీచంద్ సమాధానం…”ప్రభాస్ కి కోపం మస్తు తన చుట్టూ ఉన్న వారిని వెంటనే అక్కడి నుండి వెళ్లిపోమంటాడు. గెట్ ఔట్ అనేస్తాడు. ఆ తర్వాత అతడే ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతాడు అని చెప్పుకోచ్చడు దీంతో గోపీచంద్ మాటలకి ప్రభాస్ ఒక్కసారిగా నవ్వడం జరిగింది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!