స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్‌కు వెళ్లబోతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్ని అమ్మ పాత్రలో ముందు నగ్మాను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం బన్ని తల్లి పాత్రలో టబును తీసుకోబోతున్నారని టాక్ వినపడుతుంది. నిన్నేపెళ్లాడతా, అందరివాడు, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాల్లో నటించిన టబు చివరిగా పాండురంగ మహత్యం సినిమాలో నటించింది. మరి బన్ని తల్లి పాత్రలో నటించడానికి టబు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాలో బన్ని తండ్రి పాత్రలో బోమన్ ఇరాని నటించబోతున్నారని వార్తలు వినిపించినా, తాజాగా సత్యరాజ్ బన్ని తండ్రిగా నటిస్తారని అంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించనుంది.
previous post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!