రామోజీరావు నిర్మించిన ఇష్టం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రియా శరణ్ ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన సంతోషం సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. వరసగా యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలతోను నటించింది. శ్రియ నటించిన సినిమాలన్ని దాదాపు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అంతేకాదు టాలీవుడ్ హీరోలందరికి లక్కీ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్ లో ఒకానొక సందర్భంలో చాలా బిజీ హీరోయిన్ అంటే శ్రియ నే. అంతేకాదు హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా అందుకున్న హీరోయిన్ ఆ టైం లో శ్రియా నే.
ఇక పెళ్ళి చేసుకున్న శ్రియ సినిమాలకి దూరం అవుతుందని అందరూ భావించారు. చెప్పాలంటే శ్రియ సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్. ఆ ఛాయిస్ ఎక్కడ మిస్ అవుతుందో అన్న టాక్ కూడా వచ్చింది. కాని శ్రియ అందరు అనుకున్నట్టు సినిమాలకి గుడ్ బాయ్ చెప్పలేదు. అవకాశాలు వస్తే సినిమాలు చేయడానికి సిద్దమేనంటు సంకేతాలు పంపింది. దాంతో మన హీరోలందరు మళ్ళి శ్రియ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నట్టు ఇటీవల శ్రియ స్వయంగా వెల్లడించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి జంటగా నటిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో బాలకృష్ణ కి జంటగా శ్రియ ని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ తో శ్రియ చెన్నకేశవ రెడ్డి ఆ తర్వాత పైసా వసూల్ సినిమాలలో నటించింది. ఇక శ్రియ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావాల్సిందే. అంతగా తన అందంతో ఆకట్టుకుంటుంది.