Tina Ahuja : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఎక్కువగా బీటౌన్ ప్రాంతంలో నివసిస్తుంటారు. అందుకే బీ టౌన్ లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువగా నడుస్తుంది. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీని నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా పేరు సంపాదించుకున్న వారు వారి పలుకుబడిని ఉపయోగించి వారి పిల్లలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల ఇండస్ట్రీ లోకి వచ్చే స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను బాలీవుడ్ నెపో-కిడ్స్ (నెపోటిజం) గా పిలుస్తుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో నెపో-కిడ్స్ గా ఉన్న వీరిలో ఒక స్టార్ హీరో కూతురు మాత్రం లేదు.నెపో-కిడ్స్ లో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా ముద్దుల తనయ, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. ఈ విషయం గురించి తాజాగా టీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా టీనా మాట్లాడుతూ…తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని, తను నటించిన సినిమాలను ప్రమోట్ చేయాలని తన తండ్రి ఎప్పుడు ఏ నిర్మాతను అడగలేదని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
అందుకే ఆ లిస్టులో నా పేరు లేదు:
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ తండ్రి ఎప్పుడైనా మీకు సహాయం చేశారా? అని అడగ్గా అందుకు టీనా స్పందిస్తూ…. నా తండ్రి ఎప్పుడూ నాకు సహాయం చేయలేదు.. ఒకవేళ ఆ విధంగా చేసి ఉంటే ఇప్పటికి నేను దాదాపు ఒక ముప్పై, నలభై సినిమాలకు సంతకం చేసి ఉండేదాన్ని తెలిపారు. నాకు అవసరం అని ఆయనను సహాయం కోరితే తన తండ్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ అందరిలా నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం నా సొంత గుర్తింపుతో సినిమా అవకాశాలు దక్కించుకున్నాను. ఇప్పటివరకు తన సినిమాలను ప్రమోట్ చేయమని తన తండ్రిని అడగక పోవడం వల్లే
నెపో-కిడ్ లిస్టులో తన పేరు లేదంటూ టీనా తెలిపారు. అయితే 2015 సంవత్సరంలో టీనా ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’ లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు.