Ram Charan Birthday: “RRR” సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. భారతీయ చలనచిత్రంగా సినిమా ప్రేక్షకులతో పాటు తండ్రి చిరంజీవి చాలా మంది చరణ్ బట్టి గర్వపడుతున్నారు. మరొక ఇదే సమయంలో భార్య ఉపాసన ఆరు నెలల గర్భవతి.. చరణ్ తండ్రి కాబోతున్నాడు. చాలా వరకు చరణ్ కి అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చరణ్ బర్తడే మార్చి 27 కారణంగా అభిమానులు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. పైగా ఆస్కార్ వేదిక వరకు వెళ్లి వచ్చిన తర్వాత వస్తున్న బర్తడే నేపథ్యంలో నేడు స్పెషల్ CDP రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా “ఆరెంజ్” మూవీ రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా RC 15 సినిమా టైటిల్ ప్రకటన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. చరణ్ కెరియర్ లో ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దీంతో శంకర్ చాలా స్పెషల్ కేర్ తీసుకుని.. టైటిల్ లోగో చేస్తున్నారట. ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

చరణ్ ఈ సినిమాలో మూడు పాత్రలలో కనిపించనున్నారు. పొలిటికల్ లీడర్ ఆ తర్వాత కలెక్టర్ ఇంకా స్టూడెంట్ పాత్రలో… చరణ్ ని ఇప్పటివరకు ఎవరు చూపించని రీతిలో శంకర్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అన్ని భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ విడుదల చేయబోతున్నారట. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఇచ్చారా బర్తడే నాడు ఇటు అభిమానులు వాటి శంకర్ డబుల్ ట్రీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.